Saatyaki S / o Seshendra Sharma's photos with the keyword: seshendra Sharma
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టేబుల్ మీద ఆ పుస్…
| 25 Jul 2024 |
|
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టేబుల్ మీద
ఆ పుస్తకం.. అందరి కళ్లు దానిపైనే! //
Pawan Kalyan With Seshendra Sharma Book:
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బాధ్యతల్ని స్వీకరించారు. పవన్ ముందుగా కార్యాలయంలో పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టారు. అయితే పవన్ బాధ్యతలు చేపట్టే ముందు తన వెంట తెచ్చుకున్న ఓ బుక్ను ముందు టేబుల్పై పెట్టారు.. ఆ తర్వాతే ఫైల్స్పై సంతకాలు చేశారు. దీంతో అందరి కళ్లు ఆ టేబుల్పై ఉన్న బుక్వైపు వెళ్లాయి.
ఆ బుక్ గురించి ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టి.. కొన్ని ఫైల్స్పై సంతకాలు చేశారు. అనంతరం పార్టీల నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేయగా.. వరుసగా సమీక్షలతో బిజీ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో.. ఆయన టేబుల్పై ఓ బుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బుక్కు పవన్ ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారా అని చూస్తే.. అప్పుడు అసలు విషయం తెలిసింది.పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి పుస్తకాలు చదవడం, రచనలు అంటే చాలా ఇష్టం.. సాహిత్యంపై ఆసక్తి ఉందని చెబుతుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని పుస్తకాలన్ని ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ చదివారు. ఆయన ఎప్పుడో ఏదో ఒక పుస్తకాన్ని చదువుతుంటారని చెబుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్కు ఓ బుక్ అంటే మాత్రం చాలా ఇష్టమట.. ఆ పుస్తకాన్ని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా తన టేబుల్పై పెట్టుకున్నారు. ఆయనను ఇటీవల బాగా కదిలించిన గొప్ప పుస్తకం ఆధునిక మహాభారతం అని చెబుతుంటారు.తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించిన గుంటూరు శేషేంద్ర శర్మ ఈ ఆధునిక మహాభారతం పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పవన్ కళ్యాణ్పై అంత తీవ్ర ప్రభావం చూపించింది. ఆ బుక్ చదివినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా తన వెంటే తీసుకెళుతున్నారు. ఇవాళ కూడా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతూ ఆ బుక్ను తన పక్కనే టేబుల్పై ఉంచుకున్నారు. అంతేకాదు ఆ పుస్తకంలో కొన్ని పదాలను ఆయన రాశారు.. ఆ బుక్లోని 'ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు. నదులు, అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలతో చేసిన యువత' అంటూ రాసిన వాఖ్యాలను గుర్తు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గుంటూరు శేషేంద్ర శర్మను ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు.
మన దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి శేషేంద్ర శర్మ మాటలు.. తనను ఎంతో ప్రభావితం చేశాయి అంటుంటారు పవన్ కళ్యాణ్. అంేతకాదు ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ రీ పబ్లిష్ చేయించడం విశేషం.పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకు . శేషేంద్ర శర్మ గురించి ప్రస్తావనకు వచ్చింది. శేషేంద్ర శర్మ రచననలలో తను ప్రశ్నలకు సమాధానాలు కనిపించాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రజల కష్టాలు, ఇప్పటి జీవితాలు ఆయన రచనల్లో బాగా కనిపిస్తాయని.. దర్శకుడు త్రివిక్రమ్ తనకు ఆయన పుస్తకాలను పరిచయం చేశారన్నారు. ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని పాడైపోయే పరిస్థితిలో ఉన్నాయని తనకు తెలిసిందన్నారు. వాళ్ల అబ్బాయి దగ్గర ఓ పాత బుక్ ఉందని తెలిస్తే.. మాట్లాడి ఆ పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించినట్లు చెప్పారు. అంతటి గొప్ప కవి శేషేంద్ర శర్మను కొత్త తరానికి పరిచయం చేసే అవకాశం తనకు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటి తరానికి తెలియాలనే.. తాను రీ ప్రింట్ చేయించానన్నారు పవన్ కళ్యాణ్.గుంటూరు శేషేంద్రశర్మ గొప్ప తెలుగు కవి.. విమర్శకుడు, సాహితీవేత్త, వక్తగా ఉన్నారు. అలాగే ఆయన సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు. శేషేంద్ర శర్మ 1927 అక్టోబర్ 20న నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగరాజుపాడులో జన్మించారు. ఆయన ఏసీ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మద్రాసు లా కాలేజీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యారు.. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శేషేంద్ర శర్మ వచన కవిత్వం, పద్యరచనలో ప్రతిభావంతులు. ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ప్రత్యేకతగా చెబుతారు. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.. శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు కూడా చేశారు. 'నా దేశం-నా ప్రజలు' 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. భారత ప్రభుత్వం నుంచి ‘రాష్ట్రేంద్రు’ బిరుదు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందుకున్నారు.
telugu.samayam.com/తిరుమల బాబు | Samayam Telugu19 Jun 2024
///పవన్ కల్యాణ్ వెంటే శేషేంద్ర శర్మ పుస్తకం
HOME » ANDHRA PRADESH » ANDHRA PRADESH DEPUTY CM PAWAN KALYAN IMPRESSED SESHENDRA SHARMA BOOK SDR
Pawan Kalyan: పవన్ కల్యాణ్ వెంటే శేషేంద్ర శర్మ పుస్తకం
ABN , Publish Date - Jun 19 , 2024 | 12:56 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై రచనల ప్రభావం ఎక్కువే. ఆయన నచ్చేందే చేస్తారు. మెప్పు కోసం ప్రయత్నించారు. ఇష్టపడింది కష్టమైనా సాధించాలని అనుకుంటారు. ఒకరి పంథాలో వెళ్లరు. మన స్టైల్ మనదే అంటారు. ఒకరిలా బతకడం కాదు.. మనం మనలా బతకాలని అంటారు. పనిలో పులిలా ఉంటారు. ప్రైవసిని ఆశిస్తారు. స్టార్ హోదా పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతారు. వృత్తి, ప్రవృత్తిని సమానంగా ముందకు తీసుకెళుతున్నారు. అభిమానులనే కాదు జనంతో మమేకం అవుతారు. పవన్ కల్యాణ్లో ఓ విలక్షణ ఉంది. సాహిత్యంపై ఆసక్తి. ఆయనను కదిలించిన గొప్ప పుస్తకం ‘ఆధునిక మహాభారతం’.తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించిన గుంటూరు శేషేంద్ర శర్మ ఆ పుస్తకం రాశారు. కవిసేన మేనిఫెస్టే, కాలరేఖ వంటి సంచలన గ్రంథాలు కూడా ఆయన రాశారు. ఆధునిక మహాభారతం పుస్తకం పవన్ కల్యాణ్పై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ పుస్తకం చదివినప్పటి నుంచి తన వెంటే ఉంచుకుంటున్నారు. ఎక్కడికెళ్లిన తన వెంట తీసుకెళుతున్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను చేపట్టిన సమయంలో కూడా తన వద్ద పుస్తకం ఉంచుకున్నారు. ఆ పుస్తకంలో కొన్ని పదాలను పవన్ కల్యాణ్ రాశారు. ఒక ‘దేశపు సంపద ఖనిజాలు కాదు. నదులు, అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలతో చేసిన యువత. మన దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి శేషేంద్ర శర్మ మాటలు నన్ను అమితంగా ప్రభావితం చేశాయి అని’ పవన్ కల్యాణ్ రాశారు.
------------
Aha UNSTOPABLE 2
WITH NBK : POWER FINALE 2
On 10th February 2023
నందమూరి బాలకృష్ణ : ఇపుడు బుక్స్ విషయానికి వస్తే ఆధునిక మహాభారత పుస్తకాన్ని ఎంతో ఖర్చుపెట్టి రీప్రింట్ చేయించావు
పవన్ కళ్యాణ్ : అవును
నందమూరి బాలకృష్ణ : గుంటూరు శేషేంద్ర శర్మ గారి మహా రచయిత ఇప్పుడు తిరిగి ఈతరం కుర్రాళ్లకు పరిచయం చేశావు . నీకు ఎందుకు అలా అనిపించింది ?
పవన్ కళ్యాణ్ : నాకు నాలో ఉండే ప్రశ్నలకి చాలా వాటికి సమాధానాలు ఆ పుస్తకంలోనే ఉన్నాయి, సమాజంలో సగటు మనిషి వేదనకు గాని, సమాజం దేనికిట్లా ఉంది, అంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే సమస్యలను చూసి, వాటన్నిటికీ నాలో ఉన్న వేదనకి శేషేంద్రశర్మ గారి పుస్తకంలోని ఉన్నాయి, ఏదైనా సరే జ్ఞ్యానాన్ని పంచుకోవడం చాలా అవసరం మనకు మంచి విషయం తెలిసినప్పుడు పదిమందితో పంచుకోవాలనేది నా ఒక ఆలోచన ఉంటుంది నాకు. నేను చాలా స్ఫూర్తి పొందిన పుస్తకం కాబట్టి చదివే కొద్ది 1, 2, పుస్తకాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర దొరికింది . బుక్, ఇలా పట్టుకుంటే ముక్కలు ముక్కలు అయిపోయింది ఫస్ట్ ప్రింట్ అప్పుడో అయ్యింది . తర్వాత ఇక ప్రింట్ కాలేదు . చాలా సార్లు (ఆ పుస్తకాన్ని )వెతికాను కానీ అవుట్ ఆఫ్ ప్రింట్ , అని చెప్పారు, ఇంత గొప్ప సాహిత్యపు విలువలతో ఉన్న పుస్తకము అది
భారతదేశం నుండి నోబెల్ బహుమతికి ఎన్నికైన పుస్తకంలో మొదటిగా నిలిచిన పుస్తకం, కనుక్కోండి ఎవరైనా వారి కుటుంబ సభ్యులు ఉన్నారా అని అడిగాను, అప్పుడు కవి శేషేంద్ర శర్మ గారి అబ్బాయి సాత్యకి గారు ఉన్నారు ఆయన దగ్గర మాట్లాడితే, నా దగ్గర ప్రింట్లు లేవు కానీ, ఎవరైనా నిలబడతానంటే దాన్ని రిప్రింట్ చేయిస్తాను అన్నారు,
పవన్ కళ్యాణ్ : వెంటనే అది నా ఒక్కడి కోసం ఎందుకు అందరి కోసం చేద్దామని చెప్పి చాలా బుక్స్ ప్రింట్ చేయించాను,
నందమూరి బాలకృష్ణ : నీ వల్ల (ఒక మంచి పుస్తకం) మరుగున పడిపోకుండా ఎంతోమంది మనుసులో వెలుగు నింపిన పుస్తకానికి నువ్వు వెలుగునిచ్చా వు .
పవన్ కళ్యాణ్ : భగవంతుడు ఆ అవకాశాo నాకు ఇచ్చాడు అలాంటి కవిని కొత్త తరానికి పరిచయం చేసే అరుదైన అవకాశం గా నేను భావిస్తాను.
----
అదో గొప్ప పుస్తకం
గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఆధునిక మహాభారతం గొప్ప సాహిత్య విలువలతో ఉన్న పుస్తకం . నాలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందులో ఉన్నాయి . సగటు మనిషి వేదన , ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నలకు జవ్వాబులు కనిపించాయి . ఎక్కడా ఆ పుస్తకాలు దొరకలేదు . శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకితో మాట్లాడి పునర్ముద్రణ చేయించాం .
- పవన్ కళ్యాణ్
ఈనాడు దిన పత్రిక
10 - 02 2023
శేషేంద్ర : సాహిత్య చరిత్ర లో ఒక భయానక విషాద గాథ
| 09 Jul 2024 |
|
శేషేంద్ర : సాహిత్య చరిత్ర లో
ఒక భయానక విషాద గాథ
--------
శేషేంద్ర శర్మ కాపీరైట్స్ /
ముఖాముఖి / ప్రశ్నలు జవ్వాబులు
1. గుంటూరు శేషేంద్రశర్మ వారసులుగా మీ అనుభూతి?
జ. నాకు ఆయన నాన్న , కన్న తండ్రి. అదే వారసత్వం , కానీ సాహిత్యం గురించి
మాట్లాడుకునేప్పుడు వారసత్వం , అర్థం , లక్ష్యం , పరమార్థం దీనికి పూర్తిగా భిన్నమైనది . సాహిత్యం ద్వారా ఆయన మీద ఆదరాభిమానాలు ఉన్నవారు, ఆయనకు తగిన గుర్తిపు గౌరవ పురస్కారాలు దక్కలేదని మనస్తాపం చెందేవారు , ఆయన పాఠకులూ అందరూ ఆయన వారసులే , ఆయన సాహిత్య ఆదర్శాలను ముందుకాలాలకు చేర్చేవారు ఎవరో ? వాళ్ళని ఆయన వారసులుగా కాలం గుర్తిస్తుంది .
2. శేషేంద్ర గారికి ఎంతమంది సంతానం? వారెక్కడున్నారు? ఏం చేస్తున్నారు?
4 పిల్లలం , వారివారి జీవితాల్లో నిమగ్నులైవున్నారు
3. మీది గతంలో కాశ్మీరీ పండితుల వంశమని విన్నాను. నిజమేనా?
నాన్న కన్ను మూసిన క్షణం నుంచి ఆయన నేపథ్యాన్ని రూపుమాపే నేరపూరిత కుట్ర ఇది . ఒక రజాకార్ పుంశ్చలిక , ఆస్థాన జాగిలాలు , కిరాయి జాగిలాలు , ఒక పథకం ప్రకారం ఈ నేరానికి , ఈనాటికీ పాల్పడుతున్నారు . నూటికి నూరు పాళ్ళు తెలుగు కుటుంబం , ఆంద్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా , తోటపల్లిగూడూరు స్వగ్రామం , ఆయన తల్లిదండ్రుల నివాసం . మీకూ తెలుసు గదా .
4. నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరుతో మీ అనుబంధం?
జ. మాటల్లో చెప్పనలవి కానిది . తోటపల్లి గూడూరు అనగానే నాన్న , తాత అవ్వ అందరూక ళ్ళ ముందు ప్రత్యక్ష మవుతారు . వాళ్ళతో పెనవేసుకోవున్న స్మృతులన్నీ ఆల్బమ్ గా , మనసులో పుటలు పుటలుగా విఛ్చుకుంటాయి .
5. నాన్న గారు గ్యాన్‌బాగ్ ప్యాలస్‌కు ఎప్పుడు మారారు? ఆ సంఘటనపై మీరేం చెప్పదల్చుకున్నారు?
జ. . ఆయన జీవితంలో అత్యంత భయానకమయిన ప్రమాదం ఇది . ఇక అక్కడ అడుగు పెట్టినప్పట్నుంచి చివరి క్షణం వరకూ మానసికంగా , భౌతికంగా నరక యాతనకు గురయ్యాడు . అక్కడ ఉండలేక , ఆ నరక కూపం నుంచి , ఊబిలోంచి బయట పడలేక చెప్పనలవిగాని చిత్రవధకు గురయ్యాడు . వారానికొక సారి ఆ మనిషిని చావగొట్టి పారిపోయివచ్చ్చేవాడు . ఇక తన వద్దకు రావద్దని ఫోన్ లో అరిచేవాడు . ఆ మనిషి మినిస్టర్లతో , పెద్దవాళ్ళతో నాన్న మీద ఒత్తిడి తెచ్చ్చేది . మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడు . 1997 వరకూ ఇదే గొడవ . ఆ మనిషితో ఉన్నదీ లేదు , తెగతెంపులు అయ్యిందీ లేదు . చెప్పనలవిగాని మానసిక , శారీరక క్షోభ . తెలుగు కవుల జీవితాల్లో ఇది ఒక నేర గాథ తప్ప మరొకటి కాదు . ఆయన కవిత చదవండి .
6. హైదరాబాదుకు మారాకే శేషేంద్ర గారికి విశ్వవిఖ్యాత గుర్తింపు వచ్చింది అనడం వాస్తవం కాదా?
జ. ఇది వాస్తవం కాదు . కవిగా , పండితుడిగా 1967 నాటికే సాహిత్య వర్గాల్లో గౌరవనీయుడయిన ప్రముఖుడిగా స్థిరపడ్డాడు . ఇక సమాజం లో గానీ జన బాహుళ్యంలో గానీ కీర్తి కోసం ప్రచారం కోసం ఆయన తాపత్రయ పడలేదు , ప్రయత్నించలేదు .
7. శేషేంద్ర రచనా వారసత్వం ఎవరు పుచ్చుకున్నారు?
జ. ఆయన మీద అపారమైన ఆదరాభిమానాలతో , ఆయన నెలకొల్పిన శైలి లో కవిత్వం రాసేవాళ్ళందరూ ఆయన వారసులు అని చెప్పుకోవాలి . ఆయన మీద ఆదరాభిమానాలున్న వారందరూ ఆయన వారసులే .
8. వారి రచనలపై పూర్తి కాపీరైట్ అధికారం మీకు ఉందని విన్నాను. ఆ వివరాలు చెప్పండి?
జ . 1989 డిసెంబరు 2 న , తన సమస్త రచనల పై , వాటి అనువాదాలతో సహా , గ్రంథ హక్కులు నాకు పుట్టిన రోజు కానుక గా నాన్న రాసిచ్చ్చాడు . ఈ విషయం లో ఆయన మీద నేను ఎలాటి ఒత్తిడి చేయలేదు . ఆ రోజు ఈ విషయం ప్రస్తావించిన తక్షణమే , ఎంతో సంతోషంగా , ఉత్సాహంగా తన లెటర్ హెడ్ మీద స్వదస్తూరీలో రాసిచ్చ్చాడు .
2001లో తనంతట తానే ఒక చం దోబద్ధ పద్యం రాసాడు . నా మీద ఆయన ప్రేమానురాగాల్లో ఎలాంటి మార్పు కడవరకూ లేదన్నది సుస్పష్టం . నాన్న జీవితంలో చివరి దశకం లో ( 1997 -2007) కొన్ని నగ్న సత్యాలకు నేను ఏకైక సాక్షిని . ఆయన రచనలు ఒక వ్యక్తి స్వీయ ప్రచారం కోసం , దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించాను . పైగా ఆయన పుస్తకాలు , ఆయన రచనలు పేరుతో నకిలీ రచనలు వెలుగులోగి రావడం జరిగింది . ఇ . ధ , వారి ఆస్థాన జాగిలాలు , కిరాయి జాగిలాలు ఈ అకృత్యానికి , హేయమైన నేరానికి పాల్పడడడం మొదలైనది . దీన్ని మొగ్గలోనే తుంచేయాలని సంకల్పించాను . ఆ మనిషి , తన కి , జా . ల తో కామోత్సవ్ నవల తిరగరాయించి నాన్న పేరుతో అచ్ఛువేయించింది . సమకాలీన సాహిత్యం లో ఇంతటి ఘోరం నేటివరకూ జరగలేదు . నాన్న ఉన్నప్పుడే ఈ నేరం జరిగింది . ఇక ఆయన కన్ను మూసినా తర్వాత ఇ . ధ , తన నేరపూరిత సొంత ప్రచారం కోసం నాన్న రచనల్ని వాడుకోవడం ప్రారంభించింది . తెలుగు విశ్వవిద్యాలయం వారికి 6 లక్షలు ఇచ్చ్చి పుస్తకాలు ప్రింట్ చేయించాలని ప్రయత్నించింది . వారికీ లీగల్ నోటీసు ఇఛ్చాను . వాళ్ళు ఆ అకృత్యాన్ని విరమించుకున్నారు . ఇ . ధ నిరంతరాయంగా ఈ నేరానికి పాల్పడడం సహజమే . నీల్ కమల్ పబ్లికేషన్స్ వారితో నాదేశం నాప్రజలు ప్రింట్ చేయించింది . దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ లో 2008 లో వేసిన కేసు లో 2018లో తీర్పు వచ్చింది . నాన్న నాకు రాసిచ్చిన కాపీరైట్స్ రద్దు చేసి , తనకు 2006లో తనకు బదిలీ చేసినట్లు ఇ . ధ ఒక నకిలీ పత్రం కోర్టుకు సమర్పించింది . కోర్టువారు ఈ పత్రాన్ని తెలంగాణ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు పంపించింది . వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి , ఇ . ధ కోర్టుకు సమర్పించిన పత్రం నకిలీ ద ని , ఫోర్జరీ చేసిందని తేల్చిచెప్పింది . ఈ నివేదిక ఆధారంగానే తీర్పు చెబుతూ న్యాయమూర్తి , నాన్న రచనలు పై సర్వ హక్కులూ ఆయన కుమారుడినైన నాకు చెందుతాయని తేల్చిచెప్పారు . అసలు , ఈ తీర్పు లో ప్రధానాంశం ఏమిటంటే , నాన్న చనిపోయిన కొద్దీ రోజుల్లోనే నేను రాసిన " శేషేంద్ర శర్మ వారసులెవరు ? " వ్యాసం లో వెల్లడించిన యదార్థాలను ఈ తీర్పు ధృవీకరించింది . ఇ . ధ , ఆపాదమస్తకం నేరచరుతురాలని ఆ వ్యాసంలో నేను సాక్ష్యాధారాలతో పేర్కొన్నాను . తెలంగాణ హై కోర్టులో అప్పీలు వేసింది . జనవరి 25 , 2024 న్యాయస్థానం , ఈ అప్పీలును కొట్టేసింది . దిగువ కోర్టు తీర్పును ధృవీకరిస్తూ , ఇ . ధ , శేషేంద్ర శర్మ భార్య కాదని తేల్చిచెప్పింది . ఫలితంగా , ఇ . ధ , ఈ రోజు , నాన్న చనిపోయిన 17 సంవత్సరాల తరువాత , కొత్తగా ఆయన భార్య అని నిస్సిగ్గుగా ప్రచారం చేయిన్చుకుంటోంది . ఇ . ధ బిస్కెట్లతో పోషించే కి.జా. లు ఒకానొక పత్రికలో ఆపె పేరుతో మురికి రాతలు రాస్తున్నాయి. ఇ .ధ , ను నాన్న భార్యగా నిలబెట్టే ప్రచారం చేస్తున్నాయి . మహానుభావుడు , నార్ల వారు పత్రికా రంగంలో ఉన్నత ప్రమానాలు నెలకొల్పిన పత్రిక అది , ఈరోజు కి.జా.లకు , ఆ. జా. లకు స్థావరంగా మారింది . నకిలీ మురికి దొంగ రాతలకు నిలయంగా మారింది .
9. ఇటీవల నాన్న గారి వర్ధంతి సందర్భంగా మేము తోటపల్లి గూడూరులోని గృహం దర్శించి, అక్కడ వారి విగ్రహం ప్రతిష్టించాలని ప్రతిపాదించాం. ఈ విషయంపై మీ అభిప్రాయం?
జ. ఎంతో సంతోషకరమైన విషయం ఇది . నేను ఉబ్బితబ్బిబైపోయాను . నాన్న భౌతికంగా మన మధ్య లేక పోయినా , నిజంగా ఆత్మ అనేది ఉంటే నాన్న ఎంతో సంతోషిస్తాడు .
ఈ నేరపూరిత సమాజంలోనే , ముఖ్యంగా సాహిత్యం , పత్రికా రంగం లో కుళ్ళు హద్దు మీరిన పాడు కాలంలో , ఆయన జన్మస్థలాన్ని , ఆయన తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు ఉండడం నేటి సమాజానికి ఒక చెంపదెబ్బ . గట్టి చెప్పుదెబ్బ . మీకు నా తరఫున , ఆయన అభిమానుల తరఫున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను .
10. శేషేంద్రగారిని గూర్చి మీరింకేమైనా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నారా?
జ. నాన్న తెలుగు సామాజిక చరిత్రలో ఒక భయానక విషాద గాథ . 1967- 70 వరకూ మహ రాజులా బతికాడు . అరిపిరాల విశ్వం , పోతుకూచి సాంబశివ రావు వీళ్లిద్దరి వెధవ పని వల్ల
జీవితాంతం చిత్రవధ అనుభవించాడు . సభ్య నాగరిక సమాజం కన్నుగప్పి ఎవరికీ తెలీకుండా కర్ణాటక లోని హళేబీడు లో వీధి నాటకం తంతు జరిగింది .
పెళ్ళాంబిడ్డల్ని వదిలేసి మరోమనిషితో చేరాడన్న అవమానానికి , చెడ్డపేరు కు లోనయ్యాడు . తన స్వేఛ్చామయమైన సహజ జీవనానికి దూరమయ్యాడు .
వీటిని తట్టుకుని సాహిత్యం లో చేసిన కృషికి తగిన గౌరవమన్ననలు రాకపోగా , ఈర్ష్యాద్వేషాలకు గురయ్యాడు .
He is a jesus among jews .
- సాత్యకి S/o Seshendra Sharma
Srujana Telugu Epaper
22 Jun 2024 - Page 3
-------------
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
జననం
1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం
2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి
సుబ్రహ్మణ్య శర్మ
తల్లి
అమ్మాయమ్మ
భార్య /
జానకి
పిల్లలు
వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
-----------
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
శేషేంద్ర సింహనాదం ‘మండే సూర్యుడు’
| 09 Jul 2024 |
|
శేషేంద్ర సింహనాదం ‘మండే సూర్యుడు’
Prajasakti : Telugu Daily : Jul 8,2024
”కాలపు కఠిన శిలల్లోంచి
కాంతి జ్వాల త్రవ్వి తీస్తా !
ఎదిరించే శతాబ్దాల నిదురకు నిప్పంటిస్తా!”
ఇది సూర్యుని ఆవాహనం చేసుకున్న గుంటూరు శేషేంద్ర శర్మ సింహనాదం. ఆయన రచించిన మినీ కవితా సంకలనం ‘మండే సూర్యుడు’లోని తొలి కవితలోనే ఈ ప్రతిజ్ఞ చేశారు. 1974లో వెలువడిన ఈ కావ్యానికి 2024 స్వర్ణోత్సవ సంవత్సరం.
ప్రాచీనాంధ్ర సారస్వతానికి పట్టుకొమ్మ అయిన పద్యంపై సమున్నత సాధికారత సాధించిన శేషేంద్ర ‘ఋతుఘోష’ వంటి సర్వకాలీనమైన పద్య కావ్యాలు వెలువరించారు. ఆ తరువాత జరిగిన సమకాలీన సారస్వత పరిణామాలనూ ఆయన ఆహ్వానించారు. ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ పేరుతో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడైన కుందుర్తి వచన కవితలోనూ మహాకావ్యాల ఆవిర్భావం జరగాలని ఆశించారు. అందుకు శేషేంద్ర సమ్మతించడమే విశేషం. పర్యవసానంగా శిష్ట సంశ్లిష్ట సంస్క ృత పదభూయిష్ట సుదీర్ఘ సమాస చాలనంలో సిద్ధహస్తులైన శేషేంద్ర సరళతరమైన వచన కవిత వైపు దృష్టి సారించి మినీ కవితకు ఆద్యులయ్యారు. ఆ దశలో వెలువడిన వచన కవితల సమాహారమే ‘మండే సూర్యుడు.’ ఆ తదనంతరం శేషేంద్ర రూపొందించిన, పవన్ కళ్యాణ్ పునర్ముద్రించిన ‘ఆధునిక మహాభారతం’ బృహత్కావ్యంలో మండే సూర్యుడు ‘సూర్య పర్వం’గా చోటుచేసుకుంది.
శేషేంద్ర గారి ప్రతిజ్ఞను ప్రేరణగా తీసుకొని అర్ధ శతాబ్ది నాటి ఈ కవితలను మరోమారు పరిశీలిస్తే మిరుమిట్లు గొలిపే కాంతి జ్వాలలెన్నో గోచరిస్తాయి. శిలలు కాలానికి ప్రత్యక్ష సాక్షులు. శిలల రూపురేఖలను పరిశీలించి, వాటి గర్భంలో నిదురించే మూలకాలను పరిశోధించి కాలాన్ని అంచనా వేస్తారు. ఆ విధంగా కఠిన శిలలను నాటి సామాజిక స్థితిగతులకు ప్రతీకలుగా దర్శించిన శేషేంద్ర ఆశించే విప్లవమే తాను త్రవ్వి తీయాలనుకున్న కాంతి జ్వాల.
పాతకాలం పద్యమైతే.. వర్తమానం వచన కవిత్వం అన్నది ఆనాటి ధోరణి. వచన కవితలో అంత్యప్రాసలు, చమత్కారం, అధిక్షేపణం, ప్రముఖ పాత్ర వహిస్తాయి. వేమన ఆటవెలదిలోని సూటితనం, గజల్ నిర్మాణ చాతుర్యం, అనుష్టుప్ ఛందస్సులను ఔపోసన పట్టిన పండిత కవి శేషేంద్ర హృదయంలో రూపుదిద్దుకున్న మినీ వచన కవితలు మండే సూర్యునిలానే తళుక్కుమంటాయి.
నేను చెమట బిందువును
కండల కొండల్లో ఉదయించే
లోక బంధువును .. అంటూ ప్రారంభమయ్యే ఈ కావ్యంలో శేషేంద్ర కాలానికి, సూర్యునికి, ఆత్మగౌరవానికి ,శ్రమ శక్తికి ఎన్నో ఉపమానాలను ఎన్నో ప్రతీకలను సృష్టించారు. ”నా శరీరం/ ఒక శాశ్వత హౌమం/ అది సూర్యుడి స్వగహం” అంటూ తనే స్వయంగా మండే సూర్యునిలో అంతర్భాగమయ్యారు. ”కవిత్వం ఒక మెస్మరిజం/ కవి కన్ను ఒక ప్రిజం / నేను సృష్టించిన అలంకారం / నీ అంధకారానికి దీపం” అన్న శేషేంద్ర మనో నేత్రానికి మాత్రమే సాక్షాత్కరించే మనోహర దృశ్యాలెన్నో అక్షర వర్ణచిత్రాలై ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి.
”అస్తమించే నక్షత్ర లోకాన్ని / ఆవలిస్తూ చూసింది కాలం”, ” నాగలి భుజాన వేసుకుని/ వస్తున్నాడు సూర్యుడు/ కొండ శిఖరాలెక్కి ..”, ”అడవిలో అగ్నిజ్వాలలు/ కాషాయ వస్త్రాలను ధరించిన/ సన్యాసుల గుంపులా/ పరిగెత్తుతున్నాయిప్పుడు” … నిస్సత్తువను నిరసించే శేషేంద్ర శ్రమ శక్తికి సాష్టాంగ పడతారు.ఆ శ్రమ శక్తికి సృజనాత్మకతను జోడించడమే శేషేంద్ర వీక్షణం.
”మట్టితో జీవ శిల్పం మలచే వాడి ముందు
శూన్యంతో రేఖలు వంచే వాడి ముందు
రూపాలు మోకారిస్తాయి!”
”చెట్టు సూర్యుని గర్భంలో ధరిస్తుంది
చెట్టు గర్భం అంతర్లోక ఆకాశం”
”వర్షం వేయి చేతులతో
నా తలుపు కొడుతుంది”
శేషేంద్ర కంటిలో ప్రిజం ఉన్నందు వల్లనే ఆయన కవిత్వంలో మనకు ఈ మెస్మరిజం కనిపిస్తుంది. ”పూర్ణమదః పూర్ణమిదం” అంటూ ఉపనిషత్తులు వివరించే మార్మిక పరిభాషను ”సున్నలో బంధించబడ్డ ఆకాశం” అంటూ ఆయన మాత్రమే అంత సరళ సుందరంగా భావ వ్యక్తీకరణ చేస్తారు.
శేషేంద్ర మహౌన్నత స్వాప్నికులు.
”రాత్రి నేను నా దిండు కలసి కలలు కంటాం
పగలు నేను నా కలం వాటిని పంచుకుంటాం” అంటున్న శేషేంద్ర తన కలల గురించి చెబుతూ – ”కాగితాల పడవల్లో/ కలలు ప్రయాణం చేస్తున్నాయి” అంటున్నారు పసి హృదయంతో. అలా అని అవి ఏవో చంటి పిల్లల కలలు అనుకుంటే పొరపాటు. ఇంతకూ ఏమిటా కలలు అంటే.. ”వంగిపోతున్న దేశానికి/ నింగి ఎత్తు వెన్నెముక నిర్మించే పండుగలో పాల్గొంటున్నాయి” అంటున్నారు.
తూర్పు దిశలో ఉదయిస్తున్న ప్రభాత సూర్యబింబాన్ని చూసి స్పందించని కవులుండరు. తమను తాము మరిచిపోతూ ఏదో అసంకల్పిత పారవశ్యానికి లోనై ఆ దృశ్యాన్ని వర్ణించడం పరిపాటి. శేషేంద్ర కూడా ‘ఋతుఘోష’లో సూర్యుని వర్ణిస్తూ ‘దుర్నిరీక్ష్య ప్రభాధూర్ధరచ్ఛటలతో…’ పటు రోషకాషాయ కుటిలాంశుకశలతో..’ఖర మయూఖ క్రూర ఘనకాండ పటలితో..’ గ్రీష్మకాల ప్రాంశు కింశుక ద్యుతులతో.. ‘గగన ఘన ఘోట ఖుర నిరాఘాట ధాటి..’ అంటూ ధాటిగా మార్తాండుని ప్రచండ రథాన్ని వర్ణించారు. అదే శేషేంద్ర ఈ మండే సూర్యుడులో…
”సూర్యుడు ప్రాచీ రేఖ మీద ఉన్నాడు
అలమారు మీద ఆపిల్ పండులా” అన్నారు. అరుణోదయ సూర్యబింబాన్ని ఇంత సరళ సుందరంగా సహజ స్వభావోక్తిలో వర్ణించడం మళ్లీ శేషేంద్రకే సాధ్యమైంది. ఈ విధంగా శేషేంద్ర ప్రారంభించిన మినీ కవితా మహౌద్యమం తెలుగు నాట ఉత్తుంగ తరంగాలుగా విస్తరించింది. మళ్లీ 1985లో శేషేంద్ర ఆంధ్ర జ్యోతిలో శేషేంద్రజాలం శీర్షికన ‘అరుస్తున్న ఆద్మీ’ పేరుతో మళ్లీ లఘు కవితలు రాశారు. ఆధునిక మహాభారతంలో ‘ఆద్మీ పర్వం’ పేరుతో ఇవి చోటు చేసుకున్నాయి. ఇందులో మళ్ళీ తొలి కవిత సూర్యుని పైనే కావడం విశేషం.
”సూర్యుడి నుంచి సూర్యుడికి
ఇరవై నాలుగు గంటల దూరం
మనిషి నుంచి మనిషికి
రెండు గుండెల దూరం”
తెలుగునాట బహుళ ప్రచారంలో ఉన్న ఈ శేషేంద్ర మినీ కవిత ఇందులోదే. శేషేంద్ర హృదయం ప్రళయ విస్ఫోటనాలకే కాదు, ప్రశాంతతకూ కేంద్రమే!
”పావురంలా రాత్రి నా గుండె మీద వాలింది
బాధల తుఫానును ఒక నవ్వుతో తుడిచి వేశాను” అంటూ మండే సూర్యునిలో శేషేంద్ర చూపించిన ఈ పరిష్కార మార్గం ఈనాటి ప్రపంచ మానవాళికి శిరోధార్యం!
– డా. వెనిగళ్ల రాంబాబు
కవి, సినీ గీత రచయిత, అధ్యాపకులు
-------
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
-----------
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
Jump to top
RSS feed- Saatyaki S / o Seshendra Sharma's latest photos with "seshendra Sharma" - Photos
- ipernity © 2007-2026
- Help & Contact
|
Club news
|
About ipernity
|
History |
ipernity Club & Prices |
Guide of good conduct
Donate | Group guidelines | Privacy policy | Terms of use | Statutes | In memoria -
Facebook
X


