0 favorites     0 comments    2 visits

See also...


Keywords

గుంటూరు శేషేంద్ర శర్మ
సహస్రాబ్ది దార్శనిక క
శేషేం ద్ర ఒక కవి శిఖరం
కవిర్విశ్వో మహాతేజా
పాటల తోటలోకి నిష్క్రమ
ఏది రాసినా ఎలా చెప్పిన
యుగానికి ఒక్కడు


Authorizations, license

Visible by: Everyone
All rights reserved

2 visits


వందేమాతరం : శేషేంద్ర

వందేమాతరం : శేషేంద్ర
వందేమాతరం

--------

వందేమాతరం

శకలాం వికలాం బహుకుల సంకులాం

శోకం వ్యాకులాం మాతరం

భూరి నిరాశా నామక యామినీం

జీర్ణద్రుమ జీవిత శోభినీం

విలాపినీ విచార ప్రాపిణీమ్

భయదామ్ జ్వరదామ్ మాతరం

అభ్రంకష నిష్ఫల నినాద సనాధకరాళే

పీడిత జన బాష్ప ధారా విహార మరాళే

విభ్రాజిత్ ప్రాభవ దుర్మద జనాళే

దుర్భర దారిద్రానలకాతరాం మాతరం



- శేషేంద్ర


-------

సహస్రాబ్ది దార్శనిక కవి


కవిర్విశ్వో మహాతేజా


గుంటూరు శేషేంద్ర శర్మ


Seshendra: Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com


జననం

1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

మరణం

2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

తండ్రి


clip_image002.pngసుబ్రహ్మణ్య శర్మ

తల్లి


అమ్మాయమ్మ

భార్య /

జానకి

పిల్లలు

వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)




కవి : విమర్శకుడు


ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ…..

– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)

* * *

పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,

వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.

– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)


అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999


------------


అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర

“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”

ఆచార్య పేర్వారం జగన్నాథం

సంపాదకుడు

అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు, (ప్రచురణ 1987)

(మాజీ వైస్‌ ఛాన్సలర్‌, తెలుగు యూనివర్సిటీ)

Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
Translate into English

Comments

Sign-in to write a comment.